
జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలకు ఎంపికైన కోదాడ విద్యార్థులు
*****************************************************
భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఫిలాటలీ ఉపకార వేతనాలకు కోదాడ తేజ విద్యాలయకు చెందిన (7) ఏడు మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఉస్తేల రమాదేవి తెలిపారు.
భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో ఉపకార వేతనాల కోసం దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఫిలాటలీ పోటీలు నిర్వహించారు. భారతీయ తపాలా శాఖ పాఠశాల స్థాయి విద్యార్థులకు స్టాంపుల సేకరణను అభిరుచిగా మలుస్తూ దేశ సంస్కృతిని, కళలను, క్రీడలను, భౌగోళికంగా గుర్తింపు పొందిన ఉత్తమ ఉత్పత్తులను , చారిత్రాత్మక కట్టడాలను పరిచయం చేయడంలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. సెప్టెంబరు నెలలో భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో స్టాంపులు , ఫిలాటలీ మీద 50 మార్కులకు రాత పరీక్షను నిర్వహించారు. దీనిలో అర్హత సాధించిన (36) మంది విద్యార్థులకు స్టాంపుల సేకరణ మీద ప్రాజెక్టు పని పోటీ నిర్వహించారు.
ఈ విధానంలో నిర్వహించిన ఫిలాటలీ ప్రిలిమినరీ , ప్రాజెక్టు పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు భారతీయ తపాలా శాఖ వారు 6,000 రూపాయల ఉపకార వేతనం అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల ద్వారా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు (40) మంది ఎంపిక చేయగా తేజ విద్యాలయ , కోదాడ విద్యార్థులు ఏడుగురు ఉపకార వేతనాలు పొందడం గర్వకారణమని ప్రిన్సిపాల్ ఉస్తేల రమాదేవి తెలిపారు. 6వ తరగతి నుంచి మామిడి శ్రీపాద వల్లభ, 7వ తరగతి నుంచి సామ వెంకట శ్లోక, షేక్ కైఫీ శుభహన్, కర్నాటి మిథున్ చక్రవర్తి 8వ తరగతి నుంచి ఎసిరెడ్డి భాగ్యశ్రీ , అఖిలేష్ , కర్నాటి శ్రీకర్ చక్రవర్తి లు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచి 6,000/- ఉపకార వేతనంతో అర్హత సాధించారు.
ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఉస్తేల రమాదేవి , ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.
Visit to Sriharikota ISRO