Thursday, 20 October 2022

 క్విజ్ లో రాణించిన కోదాడ విద్యార్థులు

*****************************************************************

     యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 75 సంవత్సరాల భారత వజ్రోత్సవ ఆజాది కా అమృత మహోత్సవ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో పాఠశాల విద్యార్థులకు U - Genius ( యూ - జీనియస్ ) పేరున క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
    ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టిసి కళ్యాణ మండపం లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి మెుత్తం 452 పాఠశాలలు పాల్గొన్నాయి . (20) మార్కుల ప్రాథమిక రాత పరీక్ష నుంచి అత్యుత్తమ మార్కులు సాధించిన (6) పాఠశాల జట్లను తుది క్విజ్ కు ఎంపిక చేసారు.
     తుది క్విజ్‌లో కోదాడ తేజ విద్యాలయ 10వ తరగతి చదివే విద్యార్థులు తిప్పన అభిరాంరెడ్డి, రావులపెంట జశ్వంత్ లు ఎంపికై ఫైనల్ క్విజ్ లో రాణించి (3) వ స్థానం సాధించారు. వీరు యూనియన్ బ్యాంక్ Telangana CGM Sri సురేష్ చంద్ర థేలి గారి చేతుల మీదుగా జ్ఞాపిక , మెమెంటో, ధృవ పత్రం అందుకోవడం జరిగింది.
     2 సంవత్సరాల కరోనానంతరం ప్రత్యక్షంగా జరిగిన క్విజ్ పోటీలలో తేజ విద్యార్థులు రాణించడంతో సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ రమాసోమిరెడ్డి తెలిపారు.

 





  Visit to Sriharikota ISRO