Tuesday, 27 June 2023

 శిష్యుని విజయంతో *మనసంతా సంతోషం *

******************************************


     ఈ రోజు ఉదయం 4.30కి నా ఫోన్ కు వచ్చిన మెసేజ్ శబ్దంతో నిద్రలేచి చూసాను. “ సార్ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను SAI లో join కావడానికి అని మెసేజ్ వచ్చింది. “ అది నాశిష్యుడు దొంగరి లక్ష్మణ్ నుంచి వచ్చింది. తను మా తేజ పాఠశాలలో 2007 కు చెందిన 10వ తరగతి విద్యార్ది. 2022 సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించి Asst Director in Sports Authority of India లో ఉద్యోగం సాధించానని మెసేజ్ సారాంశం.
      తనది హుజూర్ నగర్ మండలంలోని కరక్కాయల గూడెం గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ గా చాలా సంవత్సరాలు పనిచేసాడు. తాత అంకతి అప్పయ్య గారు ఈ ప్రాంతంలో అందరికి చిరపరిచితమైన హెడ్ మాస్టర్. లక్ష్మణ్ , వాళ్ల అన్నయ్య శ్రీరాం ఇద్దరు మా విద్యార్దులే. లక్ష్మణ్ తరగతిలో ప్రతిభ తో పాటు కష్టపడే తత్వం ఉన్న విద్యార్థి. క్విజ్ లంటే చాలా ఇష్టం . అప్పట్లో విజయవాడలో హిందు దిన పత్రిక నిర్వహించిన యంగ్ వరల్డ్ క్విజ్ లో విజయం సాధించాడు. నాతో చాలా దగ్గరగా ఉండే విద్యార్థుల్లో లక్ష్మణ్ ఒకడు. సివిల్స్ రాయాలి , సాధించాలి అదే నా లక్ష్యం అని అప్పుడే తను చెపుతుండే వాడు.
   మధ్యలో కెప్టెన్ జయసింహ తో కలిసి world memory trainer అయ్యాడు. దానిలో కూడా record సృష్టించాడు. అందరు సివిల్స్ కోచింగ్ కోసం మాత్రమే ఢిల్లీ వెళ్తే , తాను మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా తనకు పట్టు ఉన్న G.S / Sociology subjects ల మీద Delhi లో civils coaching institutions లో పనిచేస్తూ చదువుకున్నాడు.  జైపూర్, భోపాల్ మరియు ఇండోర్ లలో కొన్ని సివిల్స్ కోచింగ్ సంస్థల్లో కూడా పని చేస్తున్నాడు.
     నేను జనవరిలో కుటుంబంతో మధ్యప్రదేశ్ లోని ఖజురహో యాత్ర వెళ్లినప్పుడు తనే  నాకు వాళ్ల మిత్రుడు గ్వాలియర్ సిటి కమీషనర్ సహయంతో అన్ని ఏర్పాట్లు చేసాడు.
     గత సంవత్సరం సివిల్స్ ఇంటర్వూ చేసాడు. Sociology లో ఎవరికి సాధ్యం కానన్ని మార్కులు (310/500) సాధించాడు. గ్రూప్-A సర్వీసులో భాగంగా Asst Director in SAI లో ఉద్యోగం పొందాడు. మళ్లీ అవకాశం ఉంది. ఇంకా మంచి సర్వీస్ సాధించగలడనే నమ్మకం నాకు ఉంది.
     ఈరోజు ఉదయం లేవగానే తన మెసేజ్ చూసి మనసంతా సంతోషం తో నిండిపోయింది. మనం మన శిష్యుల విజయం ద్వారా  మరింత ఉత్తేజాన్ని ఎప్పుడు  పొందుతూనే ఉంటాం. ఇదంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్పదనమే.!!

  Visit to Sriharikota ISRO