Saturday, 27 January 2024

 రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో తేజ విద్యాలయ చిన్నారుల ప్రతిభ
*********************************************************************************

    కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ( INCOIS -Indian National Center for Ocean Information Service ) ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల స్థాయిలో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలు హైదరాబాద్ నిజాంపేట లోని వారి సంస్థ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.
    మొుత్తం (15) పాఠశాల జట్లను  ఫైనల్ పోటీలకు ఎంపిక చేసి జనవరి 25న నిర్వహించిన తుది పోటీలలో కోదాడ తేజ విద్యాలయ 8వ తరగతి విద్యార్థులు సృజన్ , సునందు మరియు శాశ్వత్ లు  తృతీయ  స్థానం సాధించారు.
      ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గెలిచిన విద్యార్థులకు ఇన్కాయిస్   ( INCOIS) సంస్థ డైరెక్టర్ T.M. Balakrishna Nair గారు వారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 6,000/- నగదు బహుమతి , పతకము మరియు ధృవీకరణ పత్రము ను అందించడం జరిగింది.

 



 Republic Day Celebrations


























Wednesday, 10 January 2024

  Visit to Sriharikota ISRO