Wednesday, 21 February 2024
Monday, 19 February 2024
“ తేజ విద్యాలయ ‘ మాతోట కార్యక్రమం ‘ విద్యార్థులకు ఆదర్శం “
- రైతుబడి రాజేందర్ రెడ్డి .
*******************************************************
తేజ విద్యాలయ , కోదాడ విద్యార్థులు వినూత్నంగా సాగుచేస్తున్న “మా తోట “ కార్యక్రమాన్ని ప్రముఖ యూట్యూబర్ రైతుబడి రాజేందర్ రెడ్డి ఈరోజు సందర్శించడం జరిగింది.
తేజ విద్యార్థులు పాఠశాల జీవ శాస్త్ర విద్యలో భాగంగా మొుక్కల పెంపకం , పర్యావరణం , సేంద్రియ వ్యవసాయ విధానాల మీద అవగాహన పెంచడం కోసం మాతోట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా వినూత్న వ్యవసాయ విధానాలను తన యూట్యూబ్ ఛానల్ “ రైతుబడి “ ద్వారా అందిస్తూ 13 లక్షల వీక్షకులను పొందిన జూలకంటి రాజేందర్ రెడ్డిని విద్యార్థులతో “ముఖా ముఖి “ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించడం జరిగింది.
విద్యార్థులు పాఠశాల లోనే ఒక ఎకరం విస్తీర్ణంలో ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేయించడం జరుగుతుంది. వివిధ రకాల పంటలను విద్యార్థులకు పరిచయం చేయడం , విత్తనాలను సేకరించడం, భద్రపరచడం, మడులు తయారు చేయడం, పాత వస్త్రాలతో మల్చింగ్ చేయడం, జీవామృతం తయారీ, పంట మార్పిడి విధానం , నీరు పొదుపుగా వాడటం వంచి అనేక విధానాలను పాటించడాన్ని రాజేందర్ రెడ్డి చూసి విద్యార్థులను మరియు అధ్యాపకులను అభినందించడం జరిగింది.
విద్యార్థులతో ముఖా ముఖి చర్చలో పాల్గొని వారి సందేహలను నివృత్తి చేయడం జరిగింది.
ప్రతి పాఠశాలలోను పిల్లలకు ఈ తరహా ప్రకృతి పాఠాలను చదువుల్లో భాగంగా చేయాలని చెపుతూ ఇక్కడ నిర్వహించే ‘మాతోట’ కార్యక్రమం అన్ని పాఠశాలలకు , విద్యార్థులకు ఆదర్శం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తేజ విద్యాలయ మాతోట నిర్వాహకుడు గొబ్బి నాగేశ్వరరావు, జీవశాస్త్ర అధ్యాపకులు మాడురి శ్రీనివాస్ , ప్రిన్సిపల్ రమాసోమిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మంత్రిప్రగడ వేణుగోపాలరావు పాల్గొన్నారు.
Wednesday, 14 February 2024
Visit to Sriharikota ISRO
-
5th August 2025 Teja Vidyalaya Today’s Highlight: As part of the "Theme of the Week – Monsoon Season", students actively...


.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)




