Tuesday, 9 July 2019

*ఆదివారం ఆటవిడుపు*
     ఈ ఆదివారం ఆశ్రమం ( hostel ) విద్యార్థులతో చారిత్రక మరియు ప్రకృతి ఆరాధనా పర్యాటక ప్రాంతాలను దర్శించాం. అందులో ఒకటి  సూర్యాపేట జిల్లాలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన బౌద్ధ ఆరాధనా స్థలం ఫణిగిరి. 2వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్థూపం అద్భుతమైనది. ఫణిగిరి అసలు పేరు ధర్మచక్రపురం . ఇక్కడ ఇంకా చారిత్రక త్రవ్వకాలు జరుగుతున్నాయి. కొండపైన శివాలయం క్రింద రామాలయం కలవు. కొండ నాగుపాము లా ఉండటం వలన ఫణిగిరి అనేపేరు వచ్చింది. కొండ పక్కనే కాకతీయుల కాలం నాటి చెరువు కలదు. ఇటీవల అంతర్జాతీయ శిల్ప కళా ప్రదర్శనకు భారత దేశం నుంచి ఎంపికైన ఒకేఒక శిల్పం ఫణిగిరి త్రవ్వకాలలో లభించింనదే కావటం తెలంగాణ కే గర్వకారణం. ఫణిగిరి గ్రామం సూర్యాపేట నుంచి జనగామ దారిలో 40కి.మీ దూరంలో హైవేపై ఉంటుంది.  పిల్లల కు మరియు పెద్దలకు మంచి హిల్ ట్రెక్కింగ్ స్థలం. రెండవది ఉండ్రుగొండ
 పచ్చని చెట్లు, చుట్టూ. ఎత్తైన కొండలు, పక్షుల కిలకిల రావాలు చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళాల్సిన ప్రాంతం. శివాలయం, నర్సింహలయం కూడాకలవు.

















No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO