Saturday, 16 November 2019

                                                      " భారత్ కో జానో " రాష్ట్ర విజేత తేజ."
    భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి " భారత్ కో జానో" ( భారత్ గురించి తెలుసుకోండి - know India) క్విజ్ పోటీలు జరిగాయి. భారతీయ గొప్పతనం గురించి  అవగాహన కల్పించాలని భారత వికాస పరిషత్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తుంది. హైదరాబాద్ లో జరిగిన కోదాడ తేజ విద్యాలయ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు  బల్పునూరి పవన్ కుమార్ రెడ్డి మరియు దొంగరి విష్ణువర్ధన్ విజేతగా నిలిచారు. వీరు నవంబర్24 న కర్నాటక రాష్ట్రం లోని బెల్గాం లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గోంటారు. వీరికి ప్రముఖ కవి రచయిత్రి శ్రీ మతి భవాని దేవి , భారత్ వికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హనుమంతరావు జ్ఞాపిక, ధృవీకరణ పత్రం అందించారు.



 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO