Wednesday, 20 November 2019

                                " ఢిల్లీ హెరిటేజ్ క్విజ్  కు ఎంపికైన కోదాడ విద్యార్థులు"
    భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ సంస్థ  ( INTACH - Indian National Trust For Art and Cultural Heritage ) ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో రాష్ట్ర స్థాయి " ఇంటాక్ వారసత్వ క్విజ్" పోటీలు జరిగాయి. పాఠశాల స్థాయి విద్యార్థులకు  భారతీయ చరిత్ర, కళలు‌, సాంస్కృతిక వారసత్వ అంశాలపై  అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ పోటీలను ఢిల్లీ కి చెందిన  ఇంటాక్ సంస్థ నిర్వహిస్తుంది. సాలార్జంగ్ మ్యూజియం లో జరిగిన ఈ పోటీలలో తెలంగాణ వ్యాప్తంగా 12 జిల్లాల విజేత జట్లు పాల్గొన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన  తేజ విద్యాలయ 10వ తరగతి విద్యార్థులు  బల్పునూరి పవన్ కుమార్ రెడ్డి మరియు దొంగరి విష్ణువర్ధన్ విజేతగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన కోదాడ తేజ విద్యాలయ విద్యార్థులు డిశంబర్ 6న న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్థారు. వీరికి సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి, ఇంటాక్ తెలంగాణ కన్వీనర్ శ్రీ గోపాలకృష్ణ రిటైర్డ్ ఐ.ఏ. యస్ గారు  జ్ఞాపిక ఇచ్చి అభినందించారు.

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO