Tuesday, 30 March 2021

 కోదాడ కు క్విజ్ లో జాతీయస్థాయి పేరు

************************

          India Quiz championship 2021 కు జాతీయస్థాయిలో వేల పాఠశాలలు పోటీ పడినాయి.  అనేక దశలలో వడపోత జరిగిన పిదప ఫైనల్ పోటీలకు 6 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది.
1. ప్రెసిడెన్సీ స్కూల్, బెంగళూరు.
2. తేజ విద్యాలయ, కోదాడ.
3. పద్మ శేషాద్రి బాల భవన్, చెన్నై.
4. సెయింట్ జోసెఫ్, బెంగళూరు.
5. Bright Day school, వడోదర(బరోడ)
6. D.A.V school , కటక్.
        కోదాడ తేజ విద్యాలయ లో 9వ తరగతి చదువుతున్న చేపూరి వేణు గోపాల్ ఒక్కడిది మాత్రమే గ్రామీణ నేపథ్యం. భారత దేశ స్థాయిలో లక్షల మంది విద్యార్దులు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున నేషనల్ ఫైనల్స్ నందు తేజ విద్యాలయ విద్యార్ది ప్రాతినిథ్యం వహించటం కోదాడకు గర్వకారణం. ప్రముఖ క్విజ్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు దీనిని నిర్వహించారు.
          ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ India Quiz championship online క్విజ్ లో చేపూరి వేణుగోపాల్ నాల్గవ స్థానం సాధించి 20,000 బహుమతిని పొందాడు.
      కోదాడ ను మళ్లీ జాతీయ స్థాయి పోటీలలో నిలిపిన చేపూరి వేణుగోపాల్ ను ప్రిన్సిపల్ రమాదేవి మరియు అధ్యాపకులు అభినందించారు.

 


 

Monday, 22 March 2021

 






 దూరపు నడక- ప్రకృతి పరిశీలన

***********

        ప్రతి ఆదివారం ఉదయం లేదా సాయంత్రం విద్యార్దులను ప్రకృతి పరిశీలనలో భాగంగా దూరపు నడక ( Long Walk) కు తీసుకు వెళ్తాము. ఈ వారం కోదాడ చెరువు కట్ట పైకి విద్యార్దులను తీసుకువెళ్లాము. తెలంగాణ లోని గొలుసుకట్టు చెరువులు , వాటి ఉపయోగం, సహజ సిద్ద కొండలు, గుట్టలు, జీవ వైవిధ్యం , మత్స్య కార్మికుల జీవనం వీటన్నింటి గురించి ఇటువంటి  యాత్రల ద్వారా తెలుసుకుంటారు.
         ఆదివారం - ఆటవిడుపు కూడా పిల్లలకు నూతన చైతన్యం నింపుతుంది. ప్రశాంతమైన గాలి, వాతావరణం ఉన్న పల్లె సీమలలో గడపడం అనేది నేటి ఆధునిక యుగంలో అదృష్టం గానే భావించాలి. బాల్యం ఒక వరం - ఆస్వాదించగలగడం   భాగ్యం.










Saturday, 20 March 2021

 ఖగోళ విజ్ఞానంపై శాస్త్రీయ అవగాహన

************
                అనంతమైన అంతరిక్షం ఓ అద్భుతం. ఈ విశ్వం గురించి మనిషి సాగించిన పరిశోధనలే నేడు సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేశాయి. ప్రతి వ్యక్తికి వృత్తిలో దొరకని తృప్తి  ప్రవృత్తిలో దొరుకుతుంది.
       మన మిత్రుడు శంభుప్రసాద్ కు ఖగోళ శాస్త్రంపై చాలా ఆసక్తి. తను స్వంతంగా రెండు టెలిస్కోప్ లు ఏర్పాటు చేసుకున్నాడు. తను చాలా కాలం నుంచి ఖగోళ విజ్ఞానం మీద అవగాహన కల్పించటం గమనించి పాఠశాలకు ఆహ్వానించటం జరిగింది.
              విద్యార్దులతో  “ఖగోళ విజ్ఞానం- శాస్త్రీయ దృక్కోణం”.  అంశం మీద నిన్న సాయంత్రం విద్యార్దులతో ముచ్చటించటం జరిగింది.  రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, బుధుడు (Mars) , సప్తర్షి మండలం, సిరీస్ (Brightest star - Ceries ) , ఓరియన్ constellation లను చూపించటం జరిగింది.
                  వేకువ జామున 4.30 కు గురుడు(Jupiter) మరియు శని (Saturn) గ్రహలను చూడటం జరిగింది.
              విద్యార్దులకు అంతరిక్షం మీద ఆసక్తిని పెంచుతూ శాస్త్రీయ దృక్పధం కల్పించేందుకు టెలిస్కోప్ వీక్షణం ఒక మంచి సాధనం అని మిత్రుడు శంభూ నిరూపించాడు. పిలవగానే ఇంతదూరం వచ్చిన మిత్రునికి వారి సోదరుడు ఓం ప్రకాష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.







Friday, 5 March 2021


 Ch Venugopal of 9th Class Stand National 3rd at IQC Quiz Competition 2021




  Visit to Sriharikota ISRO