ఖగోళ విజ్ఞానంపై శాస్త్రీయ అవగాహన
************
అనంతమైన అంతరిక్షం ఓ అద్భుతం. ఈ విశ్వం గురించి మనిషి సాగించిన పరిశోధనలే నేడు సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేశాయి. ప్రతి వ్యక్తికి వృత్తిలో దొరకని తృప్తి ప్రవృత్తిలో దొరుకుతుంది.
మన మిత్రుడు శంభుప్రసాద్ కు ఖగోళ శాస్త్రంపై చాలా ఆసక్తి. తను స్వంతంగా రెండు టెలిస్కోప్ లు ఏర్పాటు చేసుకున్నాడు. తను చాలా కాలం నుంచి ఖగోళ విజ్ఞానం మీద అవగాహన కల్పించటం గమనించి పాఠశాలకు ఆహ్వానించటం జరిగింది.
విద్యార్దులతో “ఖగోళ విజ్ఞానం- శాస్త్రీయ దృక్కోణం”. అంశం మీద నిన్న సాయంత్రం విద్యార్దులతో ముచ్చటించటం జరిగింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, బుధుడు (Mars) , సప్తర్షి మండలం, సిరీస్ (Brightest star - Ceries ) , ఓరియన్ constellation లను చూపించటం జరిగింది.
వేకువ జామున 4.30 కు గురుడు(Jupiter) మరియు శని (Saturn) గ్రహలను చూడటం జరిగింది.
విద్యార్దులకు అంతరిక్షం మీద ఆసక్తిని పెంచుతూ శాస్త్రీయ దృక్పధం కల్పించేందుకు టెలిస్కోప్ వీక్షణం ఒక మంచి సాధనం అని మిత్రుడు శంభూ నిరూపించాడు. పిలవగానే ఇంతదూరం వచ్చిన మిత్రునికి వారి సోదరుడు ఓం ప్రకాష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.






No comments:
Post a Comment