భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు (20-08-2022) విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం జరిగింది!
చాలా సంవత్సరాల తర్వాత పాఠశాల పిల్లలతో థియేటర్ కు వెళ్లి మహాత్ముని సినిమా ను వాళ్ల కేరింతలు , చప్పట్ల మధ్య వీక్షించడం , గొప్ప అనుభూతి.
అహింస, సత్యం, సత్యాగ్రహం, మత సహానం వంటి వాటిని నిజ జీవితంలో ఎలా పాటించాడనేది సినిమాలో చక్కగా చూపించారు. గాంధీ , కస్తూర్బ , నెహ్రూ, పటేల్, జిన్నా పాత్రలు మన ముందు కదులుతున్నట్లనిపిస్తాయి.
స్వాతంత్ర్యం కోసం దేశ నాయకులు ఎంత త్యాగం చేసినారో “గాంధీ“ సినిమా ద్వారావిద్యార్థులకు స్పష్టంగా అర్దం అవుతుంది. ఈ తరం విద్యార్థులకు స్వాతంత్ర్య భావజాలం దాని ప్రాధాన్యత చెప్పేందుకు ఇలాంటి దేశభక్తి సినిమాలు చూపడం చాలా అవసరం.
.jpeg)


.jpeg)

.jpeg)


.jpeg)

No comments:
Post a Comment