Awareness program on Cyber Crime , Road Safety & Sexual Harassment: by Kodad Rural Police:
***********
“జాతీయ సైబర్ నేర జాగృతి దివస్” సందర్భంగా ఈరోజు కొమరబండ తేజ విద్యాలయలో కోదాడ రూరల్ పోలిస్ శాఖ వారు “ సైబర్ నేరాల మీద అవగాహన, రహదారి భద్రత నియమాలు, ఆడపిల్లల పట్ల చెడు ప్రవర్తన పై అవగాహన “( Sexual Harassment) వంటి మంచి కార్యక్రమం నిర్వహించారు. 6th to 10th class children’s విద్యార్థులు పాల్గొన్నారు.
కరోనానంతరం పిల్లలు , పెద్దలు అందరు సెల్ఫోన్ , ఇంటర్నెట్ వంటి సైబర్ టెక్నాలజీ ని వాడటం పెరిగిందని , దీనిని అవకాశం గా తీసుకుని కొంత మంది సైబర్ నేరగాళ్లు ఇంటర్ నెట్ లో రకరకాల పద్దతుల్లో మోసాలు చేస్తున్నారని వివరించారు.
పిల్లలు ఇంటర్నెట్ ద్వారా సెల్ ఫోన్ లలో ఆన్లైన్ గేమ్స్ ఆడటం , రక రకాల యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారని , ఫేస్ బుక్ , వాట్సప్ , ఇన్ స్టాగ్రమ్ , ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వాడటం చేస్తున్నారని తెలుపుతూ ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు.
తెలియని వ్యక్తులను ఫ్రెండ్స్ చేసుకోవద్దని, ఫేక్ ఎకౌంట్ , పెద్ద బహుమతి వచ్చిందని చెప్పి డబ్బు ఆశ చూపితే తల్లిదండ్రులకు చెప్పాలని లేదా పోలిస్ శాఖ వారి 1930 లేదా 100 కు వెంటనే డయల్ చేయాలని పిల్లలకు సబ్ ఇన్స్ పెక్టర్ ప్రశాంత్ చక్కగా వివరించారు.
రహదారి భద్రత & *సెక్చువల్ హరాష్మెంట్ *:
పిల్లలు 18 సంవత్సరాల తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ తో నడిపే ఏ వాహనమైనా ఇప్పుడు 18 ఏళ్లలోపు నడపరాదని తెలిపారు. ఒక వేళ నడిపి యాక్సిడెంట్ చేసిన ఏవరినైనా చంపితే వారి తల్లితండ్రులకు 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని వివరించారు. రహదారి నిబంధనలు తల్లితండ్రులకు చెప్పాలని , వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ & సీటు బెల్టు పెట్టుకునేలా ప్రామిస్ చేయించుకోవాలని సి.ఐ ప్రసాద్ గారు గట్టిగా చెప్పారు. అలాగే ఆడపిల్లల పట్ల చెడుగా ప్రవర్తించడం, రాగింగ్ చేయడం, గుడ్ టచ్ - బాడ్ టచ్ , అపరిపక్వ ప్రేమలు మెుదలైనవన్నింటిని వివరించారు. సైబర్ నేరగాళ్లు కూడా ఇంటర్నెట్ ద్వారా sexual harassment ఎలా చేస్తారనే విషయం కూడా సి.ఐ గారు విశదంగా వివరించారు.
*గంజాయి వంటి మత్తు పదార్థాలు *:
మన చుట్టూ ఉన్న అనేక మంది కాలేజి పిల్లలు సినిమా & మీడియా ప్రభావం వలన గంజాయి మరియు సిగరెట్ వంటి మత్తు పదార్దాలకు అలవాటు పడుతున్నారని ఎవరైనా గంజాయి వంటి నార్కొటిక్ డ్రగ్స్ వాడినా , కలిగి ఉన్నా , రవాణా చేసినా కూడా NDPS Act క్రింద 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని అలాంటివి గమనిస్తే కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని రంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ వి. సోమిరెడ్జి వివరించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని జరగాలని పోలిస్ శాఖ పనితీరును బహుముఖంగా ప్రశంసించారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమం ను తేజ విద్యాలయ వైస్ - ప్రిన్సిపల్ మంత్రిప్రగడ వేణుగోపాల్ గారు సమన్వయం చేసారు. దీనిలో Rangareddy Excise Asst commissioner సోమిరెడ్డి, కోదాడ రూరల్ C.I DN Prasad, S.I Prashanth & ASI Lingaiah గార్లు పాల్గొన్నారు.
Thursday, 4 August 2022
Subscribe to:
Post Comments (Atom)
Visit to Sriharikota ISRO
-
5th August 2025 Teja Vidyalaya Today’s Highlight: As part of the "Theme of the Week – Monsoon Season", students actively...
No comments:
Post a Comment