Friday, 6 January 2023

 రాష్ట్రస్థాయి క్విజ్ లో విజేత కోదాడ తేజ 

************

      మంగుళూరు కు చెందిన మణిపాల్ యూనివర్సిటీ పాఠశాల స్థాయిలో 9 నుంచి ఇంటర్ వరకు ( 9th to 10+2 ) జాతీయ స్థాయి క్విజ్ పోటీలను TAPMI “Quiz on the Breach “ పేరిట నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో క్విజ్ పోటీలను హైదరాబాద్ లో గీతం యూనివర్సిటీ లోని కిన్నెర ఆడిటోరియంలో నిర్వహించారు. చరిత్ర ( History), ఆటలు ( sports), వినోదం ( entertainment) మరియు వ్యాపారం ( Bussiness) అనే నాలుగు అంశాలను మీద క్విజ్ జరిగింది. కోదాడ తేజ విద్యాలయ (9)వ తరగతి విద్యార్థులు షేక్. రేహాన్ , మిథున్ సాయి లు 550 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు.  విశాఖ పట్నం కు చెందిన డి పౌల్స్ ( De Pauls) పాఠశాల విద్యార్థులుమరియు తేజ విద్యాలయ 10 వ తరగతి అభిరాం రెడ్డి & జశ్వంత్ లు సంయుక్తంగా  (300) పాయింట్లతో ద్వితీయ స్థానం సాధించారు.
      హైదరాబాద్ విజేతలైన కోదాడ తేజ విద్యార్థులు జనవరి 14వ తేదిన మంగుళూరు లో జరిగే జాతీయ ఫైనల్ క్విజ్ పోటీలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించటం జరుగుతుంది.
     విజేతలకు క్విజ్ మాస్టర్ హరీశ్ బహుమతులు అందించడం జరిగింది.

 








 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO