వ్యాస రచనలో రాష్ట్ర స్థాయికి కోదాడ తేజ విద్యార్థిని
*************************************
తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరుపుతున్న ప్రజా ఉత్సవాలలో భాగంగా “ పునరుత్పాదక శక్తి వనరులు“
అనే అంశంపై సూర్యాపేట జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలను బాల భవన్ లో నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
కోదాడ మండలం కొమరబండ తేజ విద్యాలయ 9వ తరగతి విద్యార్థిని ఎ. క్షత్రజ్ఞ రత్నం ప్రథమస్థానంలో నిలిచి హైదరాబాద్ లో డిశంబర్ 2 న జరగనున్న రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీకి ఎంపిక కావడం జరిగింది.
సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని క్షత్రజ్ఞ రత్నంకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.అశోక్ గారు , సెక్టోరియల్ అధికారి జనార్దన్ గారు జ్ఞాపిక (ట్రోఫి) ను అందించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సు అధికారి దేవరాజు గారు మరియు ప్రిన్సిపల్ రమాదేవి గారు చిన్నారిని అభినందించారు.

No comments:
Post a Comment