Monday, 24 March 2025

 అభిరుచి Drama Festival

శుభోదయం ,
      పాఠశాల విద్యలో భాగంగా నర్సరీ నుంచి 9వ తరగతి విద్యార్థులతో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది.
అదే “ అభిరుచి “ పిల్లల నాటికల ప్రదర్శనలు.
      తరగతి పాఠ్యాంశాల్లోని అంశాలను ( తెలుగు, హిందీ, ఆంగ్లం,గణితం , సైన్సు మరియు సోషల్) అధ్యాపకులు నాటికలుగా మలిచి పిల్లలచే ప్రదర్శించడం ఈ కార్యక్రమంలో భాగం.
      ఇందులో ప్రాథమిక తరగతుల విద్యార్థులు ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేయడం ఒక ఆనందకరమైన విషయం. హైస్కూల్ విద్యార్థులు గేయ రూపకాలను కూడా  చేర్చడం జరిగింది.
      చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి.
 
               ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి 9 వ తరగతి వరకు చిన్నారులచే (20) పైగా నాటికలు , ఒక బుర్రకథ, రెండు గేయ రూపకాలు ప్రదర్శించారు.
     పాఠశాలలో పాఠ్యాంశాలను నాటకాలుగా మలచిన తీరు అద్భుతంగా ఉందని తల్లిదండ్రులు కొనియాడారు.
 ఈ ప్రదర్శనలో పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ప్రైమరీ ఇంచార్జ్ హేమలత చక్కని సమన్వయంతో నాటకాలను నడిపారు. ఇతర ఉపాధ్యాయులు హిమబిందు, మల్లీశ్వరీ, స్వర్ణలత, నాగలక్ష్మి, లక్ష్మి, సిజి మేరియా, సౌజన్య, మమత, సరిత, సమ్రీన్ లు నాటకాలకు దర్శకత్వం వహించారు.
 ముఖ్య అతిధులు నాలుగు గంటల పాటు చిన్నారుల నాటిక ప్రదర్శనలను వీక్షించారు.
    నిజమైన విద్యలో భాగమే నాటక ప్రదర్శనలు- somasekhara sharma, DEO , Khammam .

      వినూత్నమైవృన విద్య అందించడంలో తేజ విద్యాలయ ముందంజలో ఉంది.
మంత్రిప్రగడ భర్తారావు, విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు.
             పిల్లలను ప్రేమించే పాఠశాలలు
వారికి మంచి భవిష్యత్తు ను ఇస్తారు.
చిన్నప్పటి నాటకాలు జీవితంలో మరిచిపోలేనివి.
డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, కొత్తగూడెం బాలోత్సవం వ్యవస్థాపకులు

            జీవన నైపుణ్యాలు పెంచడం లో
నాటకాలు చాలా ముఖ్యమైనవి
సోమిరెడ్డి, తేజ విద్యాలయ డైరెక్టర్
       
       మంచి పాఠశాలలో చేర్చడమే పిల్లలకు మీరు ఇచ్చే ఉత్తమ బహుమతి-
నలబోలు శ్రీనివాసరెడ్డి ,తేజ డైరెక్టర్

 




















































































No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO