Monday, 21 July 2025

 చదరంగంలో తేజ విద్యార్థుల ప్రతిభ                                           

          ఆదివారం 20 జూలై నల్గొండ లోని న్యూస్ హైస్కూల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చదరంగం పోటీలు జరిగాయి. 

           తేజ విద్యాలయ చిన్నారులు (3) విభాగాల్లో ప్రతిభ చూపి ప్రధమ స్థానంలో నిలిచారు. 

          అండర్ 13 బాలికల విభాగంలో యోగితా (6వ తరగతి) ప్రథమ స్థానం, అండర్ 11 విభాగంలో అద్వైత ( 5వ తరగతి) ప్రథమ స్థానం, అండర్ 11 బాలుర విభాగంలో పశ్య జతిన్ రెడ్డి ( 5వ తరగతి) ప్రథమ స్థానం, గోపిరెడ్డి విక్రాంత్ రెడ్డి (7వ తరగతి) ప్రత్యేక బహుమతి సాధించడం జరిగింది.

        విజేతలకు నల్గొండ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రెటరీ 
కె. కరుణాకర్ రెడ్డి , ఛీప్ అడ్వైసర్ యం. విశ్వ ప్రసాద్ గార్లు బహుమతులు, ట్రోఫీ అందజేశారు. 

         ఈ విజయం పట్ల పాఠశాల డైరెక్టర్ రమా సోమిరెడ్డి మరియు అధ్యాపకులు హర్షం వ్యక్తంచేస్తూ చిన్నారులను  అభినందించడం జరిగింది.






No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO