Monday, 1 December 2025

 క్విజ్ లో రాణించిన కోదాడ విద్యార్థులు 
****************************

    ఈ రోజు (30-11-2025) హైదరాబాద్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ( FTCCI) ఆడిటోరియంలో నెక్సస్ కంపెనీ వారు పాఠశాల స్థాయి విద్యార్థులకు ఇండికా క్విజ్ నిర్వహించారు. విద్యార్థులకు భారత దేశ చరిత్ర, సంస్కృతి, కళలు , వినోదం మరియు ఆటల మీద అవగాహనను కల్పించేందుకు ఈ పోటీలను దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నెక్సస్ సంస్థ నిర్వహిస్తోంది. 
      ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ఇండికా క్విజ్ లో 102 పాఠశాలల నుండి 412 జట్లు ( 824 మంది విద్యార్థులు) పాల్గొన్నాయి. 
          సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ లో గల తేజ విద్యాలయ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ధరావత్ నితీష్ రాజ్ , షేక్ అఫ్నాన్ ల జట్టు ప్రతిభ చూపి నాల్గవ స్థానంలో నిలిచారు. విద్యార్థులకు క్విజ్ మాస్టర్ అబిద్ అబ్దుల్లా పుస్తకాలను బహుమతిగా అందించారు. 

 














 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO