నలుగురు విద్యార్దులు- నాలుగు నేపథ్యాలు
**********************************
తేజ విద్యాలయ విద్యార్దులు అత్యున్నత ప్రతిభ కనబరిచి తుది (ఫైనల్స్ ) పోటీలో జాతీయ విజేతగా నిలిచారు. వీరి నలుగురు - నాలుగు విభిన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు.
తిప్పన అభిరామి రెడ్డి (9)
షేక్ అవాయిస్ నదీమ్ (10),
షేక్ అబ్దుస్ సమద్ (9) ,
చేపూరి వేణుగోపాల్ (10) వ తరగతులు చదువుతున్నారు.
అందరివి మద్యతరగతి కుటుంబాలే. అభిరామి రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి మేళ్లచెరువు లోని మైహోం సిమెంటు పరిశ్రమలో చిన్న ఉద్యోగి మరియు వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం, నదీమ్ తండ్రి అల్లాబక్ష్ గారు వృత్తి రీత్యా దర్జీ (tailoring). సమద్ తండ్రి హామీద్ గారికి గడియారాలు బాగుచేసే దుకాణం ( Watch Repair shop) ఉంటుండే కరోనా పరిస్థితుల్లో దుకాణం నడవక బంధువుల బట్టల దుకాణం లో పనిచేస్తున్నాడు. అమ్మ నస్రీన్ మా పాఠశాలలో హిందీ అధ్యాపకురాలు. వేణుగోపాల్ వాళ్ల నాన్న హనుమంతరావు గారు హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో చిన్న కిరాణం దుకాణం మరియు ధాన్యం వ్యాపారం నేపథ్యం.
వారి నేపథ్యం ఎలాంటిదైనా అంతర్లీనంగా సాధించాలనే కసి పిల్లలలో బాగుంది. ఈ క్విజ్ కోసం వీరు ప్రత్యేకంగా తయారైంది లేదు. ప్రతి రోజు పాఠశాల పంపించే వార్తాపత్రిక చదవడం , విశ్లేషించడం చేసేవారు. తేజ విద్యాలయ గ్రంథాలయం లోని విజ్ఞాన పుస్తకాలను, కంప్యూటర్ లాబ్ ను గత 5 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు. పిల్లల సుదీర్ఘ మైన కృషి వలన జ్ఞానంతో పాటు ఇలాంటి విజయాలను స్వంతం చేసుకుంటున్నారు. ఇదే వారి విజయ రహస్యం.
గ్రామీణ పాఠశాలలో చదివే విద్యార్దులలో ప్రతిభ మెండుగా ఉంటుంది. చదువులలో, ఆటలలో , ఆలోచనలలో విభిన్నంగా ఆలోచిస్తారు. కుల, మత, ప్రాంతీయ భేధం లేని సామరస్యం పాఠశాలల లోనే వర్ధిల్లాలి. గత 70 సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రలో పాఠశాలలు కుల, మత విభజన లేకుండా నడిచాయి. ఇక ముందు కూడా ఇలాగే నడవాలని కోరుకుందాం. ఈ విధానం నిష్కల్మషమైన చిన్నారుల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తుంది. అది విశ్వమానవీయతకు బాటలు వేస్తుంది.
తేజ విద్యాలయ విద్యార్దులు 2019 లో ఇండియాటుడే గ్రూపు సంస్థలు నిర్వహించిన “News Wiz” లో సైతం National Finals కు చేరి న్యూఢిల్లీ లోని వారి స్టూడియోలో పాల్గొన్న విషయాన్ని సైతం క్విజ్ మాస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు గుర్తుచేసి విద్యార్దులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన ధనుష్ ను ప్రత్యేకంగా అభినందించారు.

No comments:
Post a Comment