Thursday, 22 July 2021

 వర్ష ఋతువు- మాదైన హరిత లోకం
***************************

             మా ప్రపంచాన్ని మరింత పచ్చగ మార్చే వర్ష ఋతువు అంటే నాకెంతో ఇష్టం. బాల్కనీలో కూర్చుంటే వినిపించే చిరు జల్లుల సవ్వడి, గది గవాక్షం గుండా కనిపించే  చెరువు మీద తెరపలుగా ముసురుకున్న నీలిమేఘాలు,  ఆ నీలి ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న కారుమబ్బుల దృశ్యాలు, మా తోటలో దుక్కి దున్నిన ఎర్రనేలల నుంచి వచ్చే తొలకరి మట్టి వాసనలు, పచ్చని గరికతో పరుచున్న విశాల మైదానం సొబగులు, నీటి ప్రవాహంలో తేలియాడే బాస్కెట్ బాల్ ఆట స్థలం, వర్షంతో శుభ్రమై పోయి తళ తళ మెరుస్తూ హారిత శక్తినిచ్చే సౌరఫలకాలు ఆహ్లాదకరమైన ఉషోదయానికి స్వాగతం పలుకుతున్నాయి.
       యండమూరి వీరేంద్రనాథ్ ఓ నవలలో ఇలా అంటాడు “ ఎక్కడో కశ్మీర్ , ఊటి అందాలను చూడాలని కలలు కంటుంటాము. శుభోదయ వేళ మన ఇంటి గవాక్షం నుంచి చూస్తే కనిపించే గులాబీ మొగ్గ, రాత్రి వర్షంలో తడిసిన చెట్టు , వాటి ఆకుల మీద నుంచి జారిపోలేక జారిపోయే వాన చినుకుల సౌందర్యం ….. మనం సౌందర్యోపాసనతో చూడాలేగాని ఇవన్నీ నిత్యం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి.” అక్షరాల నిజమే కదా!
         తేజ విద్యాలయ, కోదాడ వచ్చి 9 సంవత్సరాలు పూర్తయింది. స్వగ్రామంలోని మా ఇంటి తర్వాత నేను అత్యధిక కాలం నివసించిన, ఇష్టపడిన ప్రదేశం ఇదే. మా కుటుంబం లో అందరికి విద్యాల














 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO