సంతోషం - సగం బలం
******************
ఈరోజు ద హిందూ, ఈనాడు లాంటి అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికల్లో ప్రధాన పేజీల్లో ( Main Edition) క్రింది వార్త రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక వార్త ఆ స్థాయిలో రావాలంటే చాలా ప్రాధాన్యత ఉండాలి. అటువంటి వార్తకు విలువ మరియు అర్హత ( credibility) ఉండితీరాలి.
డబ్బు ఉంటే ఎంత పెద్ద అడ్వర్టైజ్ మెంట్ నైనా ఇవ్వొచ్చు. కాని ప్రధాన పేజీలోవార్తను మాత్రం పొందలేము. కోదాడ లాంటి చిన్న పట్టణానికి జాతీయ స్థాయిలో మళ్లీ మళ్లీ గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది.
ఇది ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. గ్రామీణ పాఠశాల చిన్నారులు జాతీయ స్థాయిలో అందునా విజ్ఞానానికి కొలబద్ద అయిన క్విజ్ పోటీలలో రాణించడం అసాధారణ విషయం. సుదీర్ఘమైన ప్రణాళికాబద్దమైన ఆలోచన, ఆచరణతోనే సాధ్యమైంది.
కోదాడ పేరును జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్న మా చిన్నారులకి మీ అందరి ఆశీస్సులుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకరమైన వార్తలను నలుగురితో పంచుకుంటే వారి ఆశీస్సులే సగం బలం కాగలవని నమ్ముతున్నాను.


No comments:
Post a Comment