Thursday, 4 November 2021

Trekking

 ఆనందం అంటే :-
********
            ఒక్కొక్కరికి ఒక్కో నిర్వచనం . నా వరకు మనం సంతోషం ఉంటూ , అందరిని సంతోషం గా ఉంచటం. దీపావళి  అంటే టపాసులు పేల్చటమే కాదు, పిల్లల అభిరుచులను పెంచటం, పర్యావరణం పట్ల బాధ్యతను కలిగించడం, కాలుష్యం లేకుండా ప్రకృతిని కాపాడుకోవడం.
         ఈ రోజు సూర్యాపేట దగ్గరలోని తిమ్మాపూర్ వద్ద గల పెద్ద గుట్టను తేజ విద్యాలయ పిల్లలతో కలిసి పర్వతారోహణ చేసాం.
      శారీరక పటిష్టత, మానసిక ధృడత్వం కు పర్వతారోహణ మెరుగైన మార్గం. పిల్లలల్లో ఏదైనా సాధించగలం అనే భావన పెంచే ఆయుధం ఇది. పర్వత శిఖరాన నిలిచిన వేళ పిల్లల్లో కలిగిన ఆనందాన్ని వర్ణించనలవి కాలేదు.   
“ ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ఆనందపు లోతులు చూస్తాం
ఆకాశపుటంచులు కాస్తాం “
అందుకే శ్రీశ్రీ గారి మహప్రస్థానంలోని ఈ కవిత నాకిష్టం.











































 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO