Tuesday, 22 November 2022

 Sail Beyond the Horizon (21st Nov )
భూమ్యాకాశాలు కలిసే దిగంతాల అంచులు దాటి !!
***************
      “ జీవితం లో మనం ఊహించని అద్భుతాలు జరిగినప్పుడు ఉబ్బి తబ్బిబ్బవుతాము “ .
          ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది . ఎక్కడ కోదాడ - ఎక్కడ కార్వార్. కలలో కూడా ఊహించని అవకాశం మా ముందు అలా… జరిగి పోతుంది. భారత సైనిక యుద్ద స్థావరాలను , ఆయుధ సంపత్తిని భారత నావికా దళ సిబ్బంది చూపిస్తూ వివరిస్తూ వెళ్తున్నారు. వారి స్వాగతంలో ఎంత ఆప్యాయత ,
ఏర్పాటులలో ఎంత హూందాతనం!
ప్రతి క్షణం పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు !!
       ఈరోజు ముందుగా అల్పాహారం తిన్నాక వాస్కో గోవా లో ఉన్న నౌకాదళ అకాడమి / యుద్ద సన్నద్ధ కేంద్రం ఐన INS Hansa వద్దకు బస్సుల్లో తీసుకెళ్లారు. మామూలుగా ఇటువంటి రక్షణాత్మక స్థావరాల్లోకి సాధారణ పౌరులను అనుమతించరు. Thin ‘Q’ Quiz పుణ్యాన మాకు అవకాశం దొరికింది. నావికా దళం యెక్క పరిధిలో ఉండే ఈ కేంద్రం చాలా ప్రత్యేకత ఉంది. గోవా విమానాశ్రయం (డాబోలి) కూడా వీరి పరిధిలో ఉన్న రన్- వే ను వాడుకుంటుందట. సివిల్ - నావీ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్సున్న విమానాశ్రయం ఇది.
     వైమానిక సిబ్బంది తమ యుద్ద విమానాలను ఇక్కడ మోహరించడం ను చూసాము. భారత నౌకా దళం కు ప్రత్యేకంగా యుద్ద విమానాలు ఉండవు. కేవలం సముద్ర ప్రాంతంలో జరిగే యుద్ద అవసరాల కోసం తమ యెక్క భూభాగ స్థావరాలను , నౌకలను వైమానిక శాఖ వారికి ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నావికా - వైమానిక దళ సంయుక్త భాగ స్వామ్యం (నావీ - ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్స్ ) లో ఇవి కొనసాగుతాయి. అక్కడ ఉన్న వివిధ రకాల యుద్ద విమానాల ముందు వేదిక ఏర్పాటు చేసి ఫోటో షూట్ చేసారు. నౌకాదళ అధికారిణుల సంస్థ - పశ్చిమ నౌకాదళ సంక్షేమ సహకార సంస్థ (NWWA)  కు చెందిన ముఖ్యఅధికారుల సతీమణులంతా దీనిని పర్యవేక్షణ చేసారు. శ్రీమతి కళా హరికుమార్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కూడా జరిగింది. Home department power ఎంటో మనందరికి తెలుసు కదా! మహిళా మణుల ఆతిధ్యం మామూలుగా లేదు…👌మళ్లీ 11 గంటలకు అల్పాహారం ఇచ్చారు .
            తర్వాత యుద్ద విమాన ఛోదకుల ( Airforce Pilot) లతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. చాలా విషయాలు పిల్లలు వాళ్లని అడిగి తెలుసుకున్నారు. వాళ్లతో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడమైంది. సంతోషించదగ్గ పరిణామం పోల్ రాయిడ్ కెమెరా కో అప్పటికప్పుడు ఫోటో తీసి మరి ఇచ్చారు.  యుద్ద విమానాల వద్ద సెల్పీ ఫోటోలు దిగడానికి సమయం కలిపించారు .
    తర్వాత  నౌకా వైమానిక దళ సంగ్రహాలయం ( Naval Aviation Museum) కు తీసుకు వెళ్లారు. అక్కడ చాలా రకాల యుద్ద విమానాలు చూసాము. భారత నౌకాదళ సంపత్తి , అవార్డులు , నావికా  కేంద్రాల సమాచారం మెుత్తం చూడటం జరిగింది. 1965 మరియు 1971 సమయంలో పాకిస్థాన్ తో జరిగిన యుద్ద సమయంలో నౌకా దళ పాత్ర అమోఘమని అక్కడ సిబ్బంది వివరించడం జరిగింది.
    తర్వాత వైమానికా దళం యెక్క ఆకాశ ప్రదర్శన ( Air show ) కు తీసుకు వెళ్లారు. యుద్ద విమానాల టేకాఫ్ అమోఘం. కేవలం 200 మీటర్ల దూరంలో విమానం ఎగరడం , అలాగే దిగినప్పుడు వేగ నియంత్రణతో దిగడం . దానికి ఉపయోగించే పరిజ్ఞానం చూపించారు. తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ద విమానాలు ( LLHA- Loe level height Aitcraft ) మహద్భుతం. వైమానిక ఛోదకుల పనితనం - ఆకాశంలో వాళ్లు చేసిన విన్యాసాలు చూస్తే అర్దమవుతుంది.
      మధ్యాహ్నం భోజనం పంచభక్ష పరమాన్నాలతో అనొచ్చు. అదనంగా నౌకాదళ సంగీత ఆర్కెస్ట్రా తప్పనిసరి. అది వారి అతిధి మర్యాద.
                  భోజనం చేసి కార్వార్ కి బయలుదేరాము. రెండు గంటలు పశ్చిమ కనుమలు - అరేబియా సముద్ర మద్య తరం వెంట దట్టమైన అటవి భూభాగం గుండా పయనం గొప్ప అనుభూతి.. సాయంత్రం 5.30 కి కార్వార్ చేరాము.
         రాత్రి భోజనాలు సముద్ర తీరం లో అలల ఘోష వింటూ నౌకాదళ ఆర్కెస్ట్రా సంగీత కచేరి మద్య పూర్తి చేసాము. రెండవ రోజు భూమ్యాకాశాలు కలిసే దిగంతాలను ప్రత్యక్షంగా చూసాము.
 ఇది జీవితకాల జ్ఞాపకం - నావికాదళం వారు మా జ్ఞాపకాలను పదిలపరచుకోవాలని అందరితో దిగిన మరియు వ్యక్తిగతంగా వారి వారి పాఠశాల పిల్లలతో దిగిన ఫోటోలను ఫ్రేమ్ కట్టి మరి ఇవ్వడం … మాటల్లో వర్ణించనలవికాని అనిర్వచనీయ అనుభూతి.
           🙏భారత నావికాదళానికి కృతజ్ఞతలు 🙏






 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO