Sail beyond the horizon (20th Nov)
దిగంతాల అంచులు దాటి :
***********
ఇది భారతీయ నావికా దళం యెక్క ఉత్తేజకరమైన టాగ్ లైన్.
నిన్నటి వరకు నాకు దీని అర్ధం ఇంత విస్తృతంగా ఉంటుందని తెలియలేదు.
Thin “Q” పోటీ వలన భారత దేశ రక్షణలో నావికాదళం పాత్రను ఇంత దగ్గరగా చూసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణ పౌరులకు కూడా దక్కని అవకాశం ఈ క్విజ్ వలన మాకు దక్కింది.
మొుదటి రోజు - రాచ మర్యాదలు :
మాకు గోవా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ క్విజ్ కు వచ్చే (16) పాఠశాలల విద్యార్థులు, వారి వెంట వచ్చే వారిని గుర్తించటానికి ప్రత్యేకంగా నావీ క్విజ్ “టి” షర్టులు తయారు చేసి పంపించారు. విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఆహ్వనం పలకడం వారి అతిధి మర్యాదకు దర్పణం.
గానా - బజానాలతో రాత్రి విందు :
దేశ వ్యాప్తంగా ఎంపికైన అన్ని జట్లకు పరిచయ వేదిక వాస్కో గోవా లో ఉన్న “ Naval Officers Institute “ లో ఏర్పాటు చేసిన స్వాగత సంబరం మరచిపోలేని జ్ఞాపకం. నావికాదళ ఉన్నత అధికారుల సతీమణులు అందరు కలిసి NWWA - Naval Wlfare & Wellness Association పేరుతో స్వచ్ఛంద సంస్థను నడపటం ఆనవాయితీ. దీనికి నావికా దళ ఛీప్ సతీమణి అధ్యక్షురాలుగా ఉంటుంది. వారందరు ఈ పరిచయ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఆ తర్వాత జరిగిన ఫోటో షూట్ అద్భుతం. ప్రతి ఒక్కరికి నావికా దళం తరుపున భారత నావీ ఛీప్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ గారి శ్రీమతి కళా హరికుమార్ చేతుల మీదుగా ప్రత్యేక గిప్టులను అందుకోవడం ఓ గొప్ప భావన.
మాకోసం ఆరు బయట పచ్చికలో ప్రత్యేక గోవా (కొంకణ ప్రాంత ) రుచికర వంటలతో మరియు వీనల విందాన నౌకాదళ ఆర్కెస్ట్రా యెక్క సుమధుర సంగీతం కలిపి వడ్డించారు.
ఈ అతిధి మర్యాదలలో మమ్ము మేము మరిచి ఏ దిగంతాల చివరలలోనో తేలిపోయాము.
.jpeg)



.jpeg)

.jpeg)


.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)

No comments:
Post a Comment