Monday, 14 November 2022

బాల్యం - వరం

 బాల్యం - వరం :
******
ఊహలకు రంగులద్దుదాం !
ఎగిరేందుకు రెక్కలు తొడుగుదాం !!
ఆశయాలకు ఆకాశపు నిచ్చెనలు పరుద్దాం !!!
ఆనందాలకు అనంత విశ్వాసాన్ని ఇచ్చేద్దాం !!!!
……సోమన్న.

లిఖిత్ సాయి (7వ తరగతి , తేజ విద్యాలయ - కోదాడ ) 12 ఏళ్ల చిన్నారి . నిన్న గుంటూరు VVIT Campus లో జరిగిన బాలోత్సవ్ లో కవితా రచన పోటీలో అక్కడ ఇచ్చిన అంశం “అమ్మ” మీద రాసిన కవిత ద్వారా ప్రథమ బహుమతి సాధించాడు.
    లిఖిత్  రాసిన కవిత చదువుతుంటే మనసు పొరలను తట్టినట్లయింది. వాడిన చిన్ని చిన్ని పదాలు అనంత కోటి భావాలను పలికిస్తున్నట్లుంది.
      అమ్మ చదివిస్తుంటే “నా మెదడు బట్టలు కుట్టే సూదిలా పనిచేస్తుంది” అనే పదం ఈ చిన్ని బుర్రకు తట్టడం ఓ అద్భుతం. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు మా మీద మాకు మరింత నమ్మకం పెరిగేలా చేస్తుంది.
           కవిత చదివిన న్యాయ నిర్ణేతలు ఈ పిల్లవాడు ఎవడో చూడాలని మరీ పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంలో బాలోత్సవ సృష్టికర్త డాక్టర్ రమేష్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించడం మరిచిపోలేని జ్ఞాపకం.




No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO