Tuesday, 28 November 2023

 INDICA క్విజ్ విజేత తేజ విద్యాలయ కోదాడ
***************************************

    27-11-2023 న హైదరాబాద్ లోని B.M Birla ఆడిటోరియంలో ఇండికా క్విజ్ పోటీలు జరిగాయి. Nexus Organisation ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో రాష్ట్ర వ్యాపితంగా (70) పాఠశాలలు పాల్గొన్నాయి. తేజ విద్యాలయ కోదాడ (8)వ తరగతి విద్యార్థులు నోముల సృజన్ గుప్త & దేవరపల్లి సునందు వర్ధన్ రెడ్డి (57) పాయింట్లు సాధించి విజేతలుగా నిలువగా హైదరాబాద్ ఆల్  సెయింట్ స్కూల్ విద్యార్థులు (41) పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
   పాఠశాల స్థాయి (6th to 12th ) విద్యార్థులకు భారత దేశ చరిత్ర , సంస్కృతి , భౌగోళిక స్వరూపం , రాజకీయాలు , క్రీడలు , వాణిజ్య మరియు వ్యాపార రంగాలు , శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగించేందుకు ఈ క్విజ్‌ను విద్యార్థులకు 2016 నుంచి (5)  ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు.
   విజేతలు ట్రోఫీ మరియు సర్టిఫికెట్లను ILSF ( Indian Life Sciences Fund) CEO శ్రీ దేవరాజన్ గారి చేతుల మీదుగా స్వీకరించడం  జరిగింది.

 





 

 

 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO