ఆర్మీ క్విజ్ జాతీయ ఫైనల్స్ దిల్లి కి ఎంపికైన తెలంగాణ విద్యార్థులు
************************************************************
28-11-2023న చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమి (OTA) ఆడిటోరియంలో ఆర్మి క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ జరిగాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర స్థాయిలలో గెలిచిన (18) పాఠశాలల విజేతలు ఇక్కడ పాల్గొన్నారు. (3) సెమీఫైనల్స్ నిర్వహించి గెలిచిన మూడు జట్లను డిశంబర్ 3 న ఢిల్లీలోని సామ్ మానిక్ షా సెంటర్ లో జరిగే ఫైనల్స్‌కు ఎంపిక చేసారు.
హైదరాబాద్ లో నవంబర్ (17) న తెలంగాణ లో ఆర్మి క్విజ్ గెలిచిన తేజ విద్యాలయ , కోదాడ పాఠశాల ఈ పోటీలలో రాష్ట్రంతరపున చెన్నైలో పాల్లొన్నది. పాఠశాలలో (8) వ తరగతి చదువుతున్న విద్యార్థులు దేవరపల్లి సునందు వర్దన్ రెడ్డి, నోముల సృజన్ గుప్త, రామినేని సహాన మరియు గాయం రేఖశ్రీ ల జట్టు సెమీ ఫైనల్‌లో గెలిచి ఢిల్లీ లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనది.
ఆంధ్ర ప్రదేశ్ వైజాగ్ డి పౌల్ పాఠశాల , నావీ పాఠశాల ముంబై ఫైనల్స్ కు ఎంపికయ్యారు.
కార్గిల్ యుద్దం జరిగి 25 సంవత్సరాలైన సందర్భంగా బాటిల్ ఆఫ్ మైండ్స్ ( Battle of Minds ) పేరున క్విజ్ ను భారతీయ సైనిక దళం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. విద్యార్థులకు రక్షణ శాఖ పాత్ర మరియు సైనికుల సేవలు తెలియజేసేందుకు ఈ క్విజ్‌ను నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాపితంగా 32441 పాఠశాలలు పాల్గొన్నాయి. వివిధ దశల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమం (12) జట్లకు ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్లో డిశంబర్ 3 న ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.
ఫైనల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు బహుమతులను దక్షిణ భారత ప్రాంత లెప్ట్నెంట్ జనరల్ కరణ్ బీర్ సింగ్ బ్రార్ ( LIEUTENANT GENERAL KARANBIR SINGH BRAR ASSUMES COMMAND AS GOC-DAKSHIN BHARAT AREA)
గారు బహుమతులు అందించడం జరిగింది. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఉస్తేల రమాదేవి అభినందించడం జరిగింది.




No comments:
Post a Comment