క్విజ్ జాతీయ విజేత - తేజ విద్యాలయ
******************************
ఇండియాటుడే వార్తా ఛానల్ గ్రూపు ( అమృత్ విశ్వవిద్యాలయం , కోయంబత్తూర్ వారి సౌజన్యంతో) దేశ వ్యాప్తంగా కళలు, వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జి ( Arts, Commerce, Science & General Knowledge) అంశాల మీద క్విజ్ నిర్వహించారు.
ప్రతి పాఠశాల నుంచి విద్యార్దులు ఎందరైనా పాల్గొనవచ్చు. జాతీయ స్థాయి పోటీ కావడం వలన వేల పాఠశాలల నుంచి లక్షల మంది విద్యార్దులు పాల్గొన్నారు. Prelims Zonal Quarter Finals, Zonal Semi Finals, Zonal Finals, National Semi Finals గా ఐదు దశల నిర్వహణ తర్వాత మెుత్తం (8) జట్లను National Finals కు ఎంపిక చేయటం జరిగింది.
July 16, 2021 న ఇండియా టుడే గ్రూప్ ఛైర్మన్ ఐన ప్రసిద్ద జర్నలిస్టు రాజ్ దీప్ సర్దే శాయ్ గారు ప్రత్యేకంగా తుది (ఫైనల్) పోటీలను అత్యద్భుతంగా నిర్వహించారు. 60 నిమిషాల పాటు జరిగిన పోటీలో జాతీయ, అంతర్జాతీయ అంశాలనేకం అడగటం జరిగింది. ప్రతి ప్రశ్నకు 60 సకన్లలో లోపే సమాధానం చెప్పాలి. తుది ఫలితాలను ఈరోజు ప్రకటించటం జరిగింది.
తేజ విద్యాలయ విద్యార్దులు వేణుగోపాల్, నదీమ్, అభిరాం, సమద్ లు అత్యున్నత ప్రతిభ కనబరిచి తుది (ఫైనల్స్ ) పోటీలో జాతీయ విజేతగా నిలిచారు. క్విజ్ మాస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు విద్యార్దులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్దులు ఒక్కోక్కరు 50,000 విలువైన రోబోటిక్ కిట్లు బహుమతిగా గెలుపొందారు.

No comments:
Post a Comment