Thursday, 22 July 2021

 నిజమైన బడి:-
****************

        ప్రకృతి ఒడిలో పిల్లలు నేర్చుకునే విధానాన్ని పాఠశాల విద్యలో భాగం చేయడం ద్వారా వారు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం బాగా ఉంటుంది. అర్జున్  తన మాటలలో ‘బడిలో సేద్యం ‘ గురించి చక్కగా వివరించాడు. కోదాడ తేజ విద్యాలయంలో కూడా మెుదటి నుంచి ‘మా తోట’ పేరున మేము పిల్లలకు పర్యావరణ విద్యలో దీనిని భాగం చేసాము. చదవంటే కేవలం నాలుగు గోడల మద్య నేర్పే గణితము ( Maths) & శాస్త్ర విజ్ఞానం ( Science ) మాత్రమే కాదు. ఈ విశాల ప్రపంచాన్ని అవగతం చేసుకోగల అన్ని అంశాలని ప్రతి ఒక్కరు గమనించాలి. భావ వ్యక్తీకరణ మరియు సృజనకోసం భాషా శాస్త్రాలు , సామాజిక చైతన్యం కోసం సామాజిక శాస్త్రాలు, పర్యావరణ అవగాహన కోసం సేద్యపు పనులు, వారిలో అంతర్లీనంగా దాగిన అభిరుచులు వెలికి తీసేందుకు కళలు ( సంగితం,నృత్యం, చిత్రలేఖనం, క్రాప్టు మెుదలైనవి) , వ్యాయామం కోసం ఆటలు, రక్షణాత్మక మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి పాఠశాల విద్యలో ఉండాలి. అదే నిజమైన బడి. బాల్యాన్ని పిల్లలకు అందించే స్వర్గపు లోగిలి.

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO