Monday, 28 November 2022
Saturday, 26 November 2022
ఇంటాక్ క్విజ్ విజేత తేజ , కోదాడ
*******************************
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈ రోజు సాలార్జంగ్ వస్తు సంగ్రహాలయం ( Museum) లో భారతీయ సాంస్కృతిక ( INTACH HERITAGE QUIZ ) క్విజ్ 2022 ఫైనల్ పోటీలు జరిగాయి.
పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు భారతీయ కళలు, చరిత్ర , సంస్కృతి గురించి అవగాహన కల్పించటం కోసం ఈ క్విజ్ పోటీలు ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరుగుతాయి.
వీటిని భారత జాతీయ కళలు మరియు సంస్కృతి వారసత్వ సంస్థ (INTACH- Indian National trust for Arts and cultural Heritage ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
తెలంగాణ వ్యాపితంగా 100 పైగా పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీలలో కోదాడ తేజ విద్యాలయ (10)వ తరగతి విద్యార్థులు తిప్పన అభిరామి రెడ్డి , రావులపెంట జశ్వంత్ విజేతలుగా నిలిచారు. హాదరాబాద్ - గీతాంజలి దేవశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. వీరికి ఇంటాక్ట్ రాష్ట్ర కన్వీనర్ అనురాధారెడ్డి మరియు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి జ్ఞాపిక లను అందించడం జరిగింది.
Tuesday, 22 November 2022
Sail Beyond the Horizon (21st Nov )
భూమ్యాకాశాలు కలిసే దిగంతాల అంచులు దాటి !!
***************
“ జీవితం లో మనం ఊహించని అద్భుతాలు జరిగినప్పుడు ఉబ్బి తబ్బిబ్బవుతాము “ .
ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది . ఎక్కడ కోదాడ - ఎక్కడ కార్వార్. కలలో కూడా ఊహించని అవకాశం మా ముందు అలా… జరిగి పోతుంది. భారత సైనిక యుద్ద స్థావరాలను , ఆయుధ సంపత్తిని భారత నావికా దళ సిబ్బంది చూపిస్తూ వివరిస్తూ వెళ్తున్నారు. వారి స్వాగతంలో ఎంత ఆప్యాయత ,
ఏర్పాటులలో ఎంత హూందాతనం!
ప్రతి క్షణం పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు !!
ఈరోజు ముందుగా అల్పాహారం తిన్నాక వాస్కో గోవా లో ఉన్న నౌకాదళ అకాడమి / యుద్ద సన్నద్ధ కేంద్రం ఐన INS Hansa వద్దకు బస్సుల్లో తీసుకెళ్లారు. మామూలుగా ఇటువంటి రక్షణాత్మక స్థావరాల్లోకి సాధారణ పౌరులను అనుమతించరు. Thin ‘Q’ Quiz పుణ్యాన మాకు అవకాశం దొరికింది. నావికా దళం యెక్క పరిధిలో ఉండే ఈ కేంద్రం చాలా ప్రత్యేకత ఉంది. గోవా విమానాశ్రయం (డాబోలి) కూడా వీరి పరిధిలో ఉన్న రన్- వే ను వాడుకుంటుందట. సివిల్ - నావీ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్సున్న విమానాశ్రయం ఇది.
వైమానిక సిబ్బంది తమ యుద్ద విమానాలను ఇక్కడ మోహరించడం ను చూసాము. భారత నౌకా దళం కు ప్రత్యేకంగా యుద్ద విమానాలు ఉండవు. కేవలం సముద్ర ప్రాంతంలో జరిగే యుద్ద అవసరాల కోసం తమ యెక్క భూభాగ స్థావరాలను , నౌకలను వైమానిక శాఖ వారికి ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నావికా - వైమానిక దళ సంయుక్త భాగ స్వామ్యం (నావీ - ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్స్ ) లో ఇవి కొనసాగుతాయి. అక్కడ ఉన్న వివిధ రకాల యుద్ద విమానాల ముందు వేదిక ఏర్పాటు చేసి ఫోటో షూట్ చేసారు. నౌకాదళ అధికారిణుల సంస్థ - పశ్చిమ నౌకాదళ సంక్షేమ సహకార సంస్థ (NWWA) కు చెందిన ముఖ్యఅధికారుల సతీమణులంతా దీనిని పర్యవేక్షణ చేసారు. శ్రీమతి కళా హరికుమార్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కూడా జరిగింది. Home department power ఎంటో మనందరికి తెలుసు కదా! మహిళా మణుల ఆతిధ్యం మామూలుగా లేదు…👌మళ్లీ 11 గంటలకు అల్పాహారం ఇచ్చారు .
తర్వాత యుద్ద విమాన ఛోదకుల ( Airforce Pilot) లతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. చాలా విషయాలు పిల్లలు వాళ్లని అడిగి తెలుసుకున్నారు. వాళ్లతో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడమైంది. సంతోషించదగ్గ పరిణామం పోల్ రాయిడ్ కెమెరా కో అప్పటికప్పుడు ఫోటో తీసి మరి ఇచ్చారు. యుద్ద విమానాల వద్ద సెల్పీ ఫోటోలు దిగడానికి సమయం కలిపించారు .
తర్వాత నౌకా వైమానిక దళ సంగ్రహాలయం ( Naval Aviation Museum) కు తీసుకు వెళ్లారు. అక్కడ చాలా రకాల యుద్ద విమానాలు చూసాము. భారత నౌకాదళ సంపత్తి , అవార్డులు , నావికా కేంద్రాల సమాచారం మెుత్తం చూడటం జరిగింది. 1965 మరియు 1971 సమయంలో పాకిస్థాన్ తో జరిగిన యుద్ద సమయంలో నౌకా దళ పాత్ర అమోఘమని అక్కడ సిబ్బంది వివరించడం జరిగింది.
తర్వాత వైమానికా దళం యెక్క ఆకాశ ప్రదర్శన ( Air show ) కు తీసుకు వెళ్లారు. యుద్ద విమానాల టేకాఫ్ అమోఘం. కేవలం 200 మీటర్ల దూరంలో విమానం ఎగరడం , అలాగే దిగినప్పుడు వేగ నియంత్రణతో దిగడం . దానికి ఉపయోగించే పరిజ్ఞానం చూపించారు. తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ద విమానాలు ( LLHA- Loe level height Aitcraft ) మహద్భుతం. వైమానిక ఛోదకుల పనితనం - ఆకాశంలో వాళ్లు చేసిన విన్యాసాలు చూస్తే అర్దమవుతుంది.
మధ్యాహ్నం భోజనం పంచభక్ష పరమాన్నాలతో అనొచ్చు. అదనంగా నౌకాదళ సంగీత ఆర్కెస్ట్రా తప్పనిసరి. అది వారి అతిధి మర్యాద.
భోజనం చేసి కార్వార్ కి బయలుదేరాము. రెండు గంటలు పశ్చిమ కనుమలు - అరేబియా సముద్ర మద్య తరం వెంట దట్టమైన అటవి భూభాగం గుండా పయనం గొప్ప అనుభూతి.. సాయంత్రం 5.30 కి కార్వార్ చేరాము.
రాత్రి భోజనాలు సముద్ర తీరం లో అలల ఘోష వింటూ నౌకాదళ ఆర్కెస్ట్రా సంగీత కచేరి మద్య పూర్తి చేసాము. రెండవ రోజు భూమ్యాకాశాలు కలిసే దిగంతాలను ప్రత్యక్షంగా చూసాము.
ఇది జీవితకాల జ్ఞాపకం - నావికాదళం వారు మా జ్ఞాపకాలను పదిలపరచుకోవాలని అందరితో దిగిన మరియు వ్యక్తిగతంగా వారి వారి పాఠశాల పిల్లలతో దిగిన ఫోటోలను ఫ్రేమ్ కట్టి మరి ఇవ్వడం … మాటల్లో వర్ణించనలవికాని అనిర్వచనీయ అనుభూతి.
🙏భారత నావికాదళానికి కృతజ్ఞతలు 🙏
Sail beyond the horizon (20th Nov)
దిగంతాల అంచులు దాటి :
***********
ఇది భారతీయ నావికా దళం యెక్క ఉత్తేజకరమైన టాగ్ లైన్.
నిన్నటి వరకు నాకు దీని అర్ధం ఇంత విస్తృతంగా ఉంటుందని తెలియలేదు.
Thin “Q” పోటీ వలన భారత దేశ రక్షణలో నావికాదళం పాత్రను ఇంత దగ్గరగా చూసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణ పౌరులకు కూడా దక్కని అవకాశం ఈ క్విజ్ వలన మాకు దక్కింది.
మొుదటి రోజు - రాచ మర్యాదలు :
మాకు గోవా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ క్విజ్ కు వచ్చే (16) పాఠశాలల విద్యార్థులు, వారి వెంట వచ్చే వారిని గుర్తించటానికి ప్రత్యేకంగా నావీ క్విజ్ “టి” షర్టులు తయారు చేసి పంపించారు. విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఆహ్వనం పలకడం వారి అతిధి మర్యాదకు దర్పణం.
గానా - బజానాలతో రాత్రి విందు :
దేశ వ్యాప్తంగా ఎంపికైన అన్ని జట్లకు పరిచయ వేదిక వాస్కో గోవా లో ఉన్న “ Naval Officers Institute “ లో ఏర్పాటు చేసిన స్వాగత సంబరం మరచిపోలేని జ్ఞాపకం. నావికాదళ ఉన్నత అధికారుల సతీమణులు అందరు కలిసి NWWA - Naval Wlfare & Wellness Association పేరుతో స్వచ్ఛంద సంస్థను నడపటం ఆనవాయితీ. దీనికి నావికా దళ ఛీప్ సతీమణి అధ్యక్షురాలుగా ఉంటుంది. వారందరు ఈ పరిచయ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఆ తర్వాత జరిగిన ఫోటో షూట్ అద్భుతం. ప్రతి ఒక్కరికి నావికా దళం తరుపున భారత నావీ ఛీప్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ గారి శ్రీమతి కళా హరికుమార్ చేతుల మీదుగా ప్రత్యేక గిప్టులను అందుకోవడం ఓ గొప్ప భావన.
మాకోసం ఆరు బయట పచ్చికలో ప్రత్యేక గోవా (కొంకణ ప్రాంత ) రుచికర వంటలతో మరియు వీనల విందాన నౌకాదళ ఆర్కెస్ట్రా యెక్క సుమధుర సంగీతం కలిపి వడ్డించారు.
ఈ అతిధి మర్యాదలలో మమ్ము మేము మరిచి ఏ దిగంతాల చివరలలోనో తేలిపోయాము.
Monday, 14 November 2022
బాల్యం - వరం
బాల్యం - వరం :
******
ఊహలకు రంగులద్దుదాం !
ఎగిరేందుకు రెక్కలు తొడుగుదాం !!
ఆశయాలకు ఆకాశపు నిచ్చెనలు పరుద్దాం !!!
ఆనందాలకు అనంత విశ్వాసాన్ని ఇచ్చేద్దాం !!!!
……సోమన్న.
లిఖిత్ సాయి (7వ తరగతి , తేజ విద్యాలయ - కోదాడ ) 12 ఏళ్ల చిన్నారి . నిన్న గుంటూరు VVIT Campus లో జరిగిన బాలోత్సవ్ లో కవితా రచన పోటీలో అక్కడ ఇచ్చిన అంశం “అమ్మ” మీద రాసిన కవిత ద్వారా ప్రథమ బహుమతి సాధించాడు.
లిఖిత్ రాసిన కవిత చదువుతుంటే మనసు పొరలను తట్టినట్లయింది. వాడిన చిన్ని చిన్ని పదాలు అనంత కోటి భావాలను పలికిస్తున్నట్లుంది.
అమ్మ చదివిస్తుంటే “నా మెదడు బట్టలు కుట్టే సూదిలా పనిచేస్తుంది” అనే పదం ఈ చిన్ని బుర్రకు తట్టడం ఓ అద్భుతం. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు మా మీద మాకు మరింత నమ్మకం పెరిగేలా చేస్తుంది.
కవిత చదివిన న్యాయ నిర్ణేతలు ఈ పిల్లవాడు ఎవడో చూడాలని మరీ పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంలో బాలోత్సవ సృష్టికర్త డాక్టర్ రమేష్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించడం మరిచిపోలేని జ్ఞాపకం.
Wednesday, 9 November 2022
Friday, 4 November 2022
Visit to Sriharikota ISRO
-
5th August 2025 Teja Vidyalaya Today’s Highlight: As part of the "Theme of the Week – Monsoon Season", students actively...











.jpeg)



.jpeg)

.jpeg)


.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)





