Wednesday, 29 November 2023
ఆర్మీ క్విజ్ జాతీయ ఫైనల్స్ దిల్లి కి ఎంపికైన తెలంగాణ విద్యార్థులు
************************************************************
28-11-2023న చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమి (OTA) ఆడిటోరియంలో ఆర్మి క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ జరిగాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర స్థాయిలలో గెలిచిన (18) పాఠశాలల విజేతలు ఇక్కడ పాల్గొన్నారు. (3) సెమీఫైనల్స్ నిర్వహించి గెలిచిన మూడు జట్లను డిశంబర్ 3 న ఢిల్లీలోని సామ్ మానిక్ షా సెంటర్ లో జరిగే ఫైనల్స్‌కు ఎంపిక చేసారు.
హైదరాబాద్ లో నవంబర్ (17) న తెలంగాణ లో ఆర్మి క్విజ్ గెలిచిన తేజ విద్యాలయ , కోదాడ పాఠశాల ఈ పోటీలలో రాష్ట్రంతరపున చెన్నైలో పాల్లొన్నది. పాఠశాలలో (8) వ తరగతి చదువుతున్న విద్యార్థులు దేవరపల్లి సునందు వర్దన్ రెడ్డి, నోముల సృజన్ గుప్త, రామినేని సహాన మరియు గాయం రేఖశ్రీ ల జట్టు సెమీ ఫైనల్‌లో గెలిచి ఢిల్లీ లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనది.
ఆంధ్ర ప్రదేశ్ వైజాగ్ డి పౌల్ పాఠశాల , నావీ పాఠశాల ముంబై ఫైనల్స్ కు ఎంపికయ్యారు.
కార్గిల్ యుద్దం జరిగి 25 సంవత్సరాలైన సందర్భంగా బాటిల్ ఆఫ్ మైండ్స్ ( Battle of Minds ) పేరున క్విజ్ ను భారతీయ సైనిక దళం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. విద్యార్థులకు రక్షణ శాఖ పాత్ర మరియు సైనికుల సేవలు తెలియజేసేందుకు ఈ క్విజ్‌ను నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాపితంగా 32441 పాఠశాలలు పాల్గొన్నాయి. వివిధ దశల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమం (12) జట్లకు ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్లో డిశంబర్ 3 న ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.
ఫైనల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు బహుమతులను దక్షిణ భారత ప్రాంత లెప్ట్నెంట్ జనరల్ కరణ్ బీర్ సింగ్ బ్రార్ ( LIEUTENANT GENERAL KARANBIR SINGH BRAR ASSUMES COMMAND AS GOC-DAKSHIN BHARAT AREA)
గారు బహుమతులు అందించడం జరిగింది. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఉస్తేల రమాదేవి అభినందించడం జరిగింది.
Tuesday, 28 November 2023
INDICA క్విజ్ విజేత తేజ విద్యాలయ కోదాడ
***************************************
27-11-2023 న హైదరాబాద్ లోని B.M Birla ఆడిటోరియంలో ఇండికా క్విజ్ పోటీలు జరిగాయి. Nexus Organisation ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో రాష్ట్ర వ్యాపితంగా (70) పాఠశాలలు పాల్గొన్నాయి. తేజ విద్యాలయ కోదాడ (8)వ తరగతి విద్యార్థులు నోముల సృజన్ గుప్త & దేవరపల్లి సునందు వర్ధన్ రెడ్డి (57) పాయింట్లు సాధించి విజేతలుగా నిలువగా హైదరాబాద్ ఆల్ సెయింట్ స్కూల్ విద్యార్థులు (41) పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
పాఠశాల స్థాయి (6th to 12th ) విద్యార్థులకు భారత దేశ చరిత్ర , సంస్కృతి , భౌగోళిక స్వరూపం , రాజకీయాలు , క్రీడలు , వాణిజ్య మరియు వ్యాపార రంగాలు , శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగించేందుకు ఈ క్విజ్‌ను విద్యార్థులకు 2016 నుంచి (5) ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు.
విజేతలు ట్రోఫీ మరియు సర్టిఫికెట్లను ILSF ( Indian Life Sciences Fund) CEO శ్రీ దేవరాజన్ గారి చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది.
Friday, 24 November 2023
వ్యాస రచన పోటీలో విజేతలకు బహుమతులు
**********
Legal services Authority of India వారు గత వారంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఉత్తమ రచనలకుగాను ఎంపికైన విద్యార్థులకు ఈ రోజు కోదాడ మేజిస్ట్రేట్ శ్రీయుత గౌరవనీయులైన శ్యాం సుందర్ గారు బహుమతులను అందించడం జరిగింది.
పోటీలో పాల్గొన్న అందరు విజేతలే అని పేర్కొన్నారు. ఇలాంటి పాఠ్యేతర సాంస్కృతిక పోటీలను విద్యార్థులకు పెట్టడం మంచికార్యక్రమము అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
విజేతలు :-
వ్యాస రచన - తెలుగు
****+**
ప్రథమ - కృష్ణ ప్రియ -10th
ద్వితీయ - తేజ శ్రీ -10th
తృతీయ - ఆశీష్ -8th & అంజుమ్ 8th
Essay writting - English
********
First -Suhana -10th
2nd - Asmika -9th
3rd - Afsah Jabeen -9th
Consolation- ప్రోత్సాహకర బహుమతులు
10th class - Sansita & Upagna Reddy ,
9th class - Harini & Deekhitha
8th class - Rishika , Purva Reddy & Krithika.
7th class - Bhavagna
6th class - Mokshith & Rishika.
చిన్నారులకు అభినందనలు
Thursday, 16 November 2023
Visit to Sriharikota ISRO
-
5th August 2025 Teja Vidyalaya Today’s Highlight: As part of the "Theme of the Week – Monsoon Season", students actively...
.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)


.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)











.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)


.jpeg)

.jpeg)
