Saturday, 26 November 2022

 ఇంటాక్ క్విజ్ విజేత తేజ , కోదాడ 

*******************************

           తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈ రోజు సాలార్జంగ్ వస్తు సంగ్రహాలయం ( Museum) లో భారతీయ సాంస్కృతిక ( INTACH  HERITAGE QUIZ ) క్విజ్ 2022 ఫైనల్ పోటీలు జరిగాయి.
      పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు భారతీయ కళలు, చరిత్ర , సంస్కృతి గురించి అవగాహన కల్పించటం కోసం ఈ క్విజ్ పోటీలు ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరుగుతాయి.
   వీటిని భారత జాతీయ కళలు మరియు సంస్కృతి వారసత్వ సంస్థ (INTACH- Indian National trust for Arts and cultural Heritage ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
      తెలంగాణ వ్యాపితంగా 100 పైగా పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీలలో కోదాడ తేజ విద్యాలయ (10)వ తరగతి విద్యార్థులు తిప్పన అభిరామి రెడ్డి , రావులపెంట జశ్వంత్ విజేతలుగా నిలిచారు. హాదరాబాద్ - గీతాంజలి దేవశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. వీరికి ఇంటాక్ట్ రాష్ట్ర కన్వీనర్ అనురాధారెడ్డి మరియు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి జ్ఞాపిక లను అందించడం జరిగింది.

 





 

No comments:

Post a Comment

Teja Vidyalaya Students Excel in Tata Building India 2026 Essay Writing Competition

 The students of Teja Vidyalaya showcased their creativity, knowledge, and writing abilities in the prestigious Tata Building India 2026 Ess...