తేజ విద్యాలయలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
*******************
5th September 2026 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తేజ విద్యాలయలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 6 మరియు 7వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఒక గీతాన్ని ఆలపించారు.
తేజ విద్యాలయ లో 5th ఏప్రిల్ 2026 న జరిగిన “ భారతీయం “ కార్యక్రమం మీద రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పాఠశాల ఉపాధ్యాయులందరికి భారతీయం పుస్తకాన్ని అందించడం జరిగింది.
తేజ విద్యాలయలో సుధీర్ఘ కాలం సేవలను చేసిన ఉపాధ్యాయుల సేవను గుర్తించి వారికి పుష్పగుచ్ఛాలను విద్యార్థులు అందించారు. యాజమాన్యం తరపున ప్రిన్సిపాల్ రమక్క , వ్యవస్థాపకులు సోమన్న ఉపాధ్యాయులను శాలువాతో మరియు నగదుతో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని , “ తేజ విద్యాలయ “ విలువలతో నడిచే సంస్థ అని అందుకే ఉపాధ్యాయులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
*Teachers' Day Celebrations at Teja Vidyalaya*
*_**_****
On the occasion of Teachers' Day on 5th September 2026, it was celebrated grandly at Teja Vidyalaya.
On the occasion of Teachers' Day, the school students expressed their views. Students of class 6 and 7 sang a song keeping in mind the importance of teachers.
On this occasion, a book made on the "Bharateeyam" program held on 5th April 2026 at Teja Vidyalaya was unveiled. The Bharateeyam book was distributed to all the teachers of the school.
Students presented bouquets to the teachers who have served for a long time at Teja Vidyalaya in recognition of their service. On behalf of the management, Principal Ramakka and Founder Somanna felicitated the teachers with shawls and cash rewards.
Speaking on this occasion, Somanna said that the teaching profession should strive to shape the society in an ideal manner, and that "Teja Vidyalaya" is an organization that runs on values and that is why it gives top priority to teachers.



















No comments:
Post a Comment