A small poetry by T Abhilash of 8 th Class about Father's Day
తల్లి ఇంటికి గౌరవం అయితే తండ్రి ఇంటికి అస్తిత్వం అవుతాడు ,
తల్లి వద్ద అనురాగంతో ఉంటే తండ్రి వద్ద అణకువగా ఉంటారు ,
రెండు పూటలా భోజనం తల్లి సిద్దం చేస్తే , జీవితాంతం భోజనాన్ని సమకూర్చే తండ్రిని సహజంగానే మరచిపోతాము
ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలితే "అమ్మా" అనే మాట నోటి వెంట వస్తుంది ,కానీ రోడ్డువెంట వెళుతుంటే ఏదైనా ట్రక్ దగ్గరగా వచ్చి బ్రేక్ వేస్తే "బాప్ రే " అంటూ నోటివెంట వస్తుంది . ఎందుకంటే చిన్న చిన్న కష్టాలకు అమ్మ ఉంది కానీ పెద్ద కష్టాలకు తండ్రి గుర్తుకు వస్తాడు .
తండ్రి ఒక వట వృక్షం . దీని చల్లని నీడలో సంపూర్ణ కుటుంబం సుఖంగా ఉంటారు .
ఇట్లుటీ . అభిలాష్

No comments:
Post a Comment